AP: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై వైఎస్సార్సీపీ నేత చింతాడ రవికుమార్ స్పందిస్తూ, ఫోర్జరీ సంతకాలతో ఎలా విత్డ్రా చేసుకుంటారని రిటర్నింగ్ అధికారిని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రజా క్షేత్రంలో పోటీ చేయలేక దొడ్డిదారిన ఇటువంటి నీచానికి పాల్పడ్డారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.