AP: విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి సత్తా చాటింది. మేయర్గా టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 2.30 లక్షల వరకు ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచినట్లు సమాచారం. మరోవైపు కూటమి కార్పొరేటర్ అభ్యర్థులు సైతం పలు వార్డుల్లో ఆధిక్యం కనబరుస్తూ విజయాల దిశగా సాగుతున్నారు.