AP: మున్సిపల్ కార్పొరేషన్లల్లో కూటమి అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. మొత్తం 13 కార్పొరేషన్లలో కౌంటింగ్ జరగగా.. టీడీపీ అభ్యర్థులు 4 స్థానాల్లో విజయం సాధించారు. మచిలీపట్నం మేయర్‌గా షేక్ అబ్దుల్ అబీదా (టీడీపీ), గుంటూరు మేయర్‌గా కోవెలమూడి లక్ష్మీఅపర్ణ (టీడీపీ), తిరుపతి మేయర్‌గా మన్నెం శ్రీనివాస ప్రసాద్ (టీడీపీ), చిత్తూరు మేయర్‌గా కఠారి హేమలత(టీడీపీ) గెలుపొందారు. టీడీపీ 5, జనసేన 3, వైసీపీ 1 చోట ఆధిక్యంలో ఉంది.