ఏపీలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

AP: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉత్సాహంగా ప్రారంభమైంది. ఇందులో భాగంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 73 మున్సిపాలిటీలు, 6 నగర పంచాయతీలలో ఓటింగ్ కొనసాగుతోంది. ఈ ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. మొత్తం 11,378 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కాగా 92 స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా, 8 చోట్ల ఫలితాలు ఏకగ్రీవమయ్యాయి. అలాగే మున్సిపల్ నగర పంచాయతీలు, వార్డులలో కూడా ఏకగ్రీవ ఎన్నికలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్

✕
✕