ఏపీలో నవంబర్ 1న 13 నగరపాలక సంస్థలు, 79 పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లోని 2,382 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఓటర్లు తమ పోలింగ్ కేంద్రం వివరాలను ఏపీ ఎన్నికల సంఘం వెబ్సైట్లో ( https://sec-ems.ap.gov.in/apsec/) తెలుసుకోవచ్చు. ‘ఓటర్స్ పోర్టల్’లో ‘నో యువర్ పోలింగ్ స్టేషన్’ ఎంచుకుని రూరల్ లేదా అర్బన్ లోకల్ బాడీస్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. జిల్లా, మండలం, ఓటర్ ఐడీ వివరాలు నమోదు చేసి క్యాప్చా పూర్తి చేస్తే పోలింగ్ కేంద్రం సమాచారం కనిపిస్తుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది.