ఏపీలో మున్సిపల్ ఎన్నికలు.. రేపే పోలింగ్

ఏపీలో 13 కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలకు రేపు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఈరోజు పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సుల పంపిణీ ప్రక్రియను అధికారులు పూర్తి చేశారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుండగా, 36,351 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. 4,372 పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయగా, సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచారు. నవంబర్ 2న అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహించి, నవంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕