ఏపీలో మున్సిపల్ ఎన్నికలు.. ఓటర్ లిస్ట్ విడుదల

ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 58 అర్బన్‌ లోకల్‌ బాడీలు, విజయనగరం కార్పొరేషన్‌కు సంబంధించిన ఫొటో ఓటర్ల జాబితాను విడుదల చేసింది. వీటి పరిధిలో మొత్తం 1,971 వార్డులు ఉన్నాయి. జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు. మిగతా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఓటర్ల జాబితాలను త్వరలో విడుదల చేయనున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕