AP: బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే 123 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రాబోయే గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు. దీనికోసం ప్రభుత్వం రూ.2,000 కోట్లు కేటాయించిందన్నారు. గతంలో జల్ జీవన్ మిషన్ కింద మంజూరైన రూ.5,350 కోట్ల నిధులు వినియోగించుకోకపోవడంతో నిలిచిపోయిన ప్రాజెక్టులను కేంద్రం సహకారంతో పునరుద్ధరిస్తామన్నారు.