మున్సిపల్ ఫలితాలు.. భార్యాభర్తలు విజయం

AP: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపల్ ఎన్నికల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 24వ వార్డు నుంచి పోటీ చేసిన కాళ్ళ జయదేవ్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, 25వ వార్డు నుంచి ఆయన భార్య బదకల ప్రియ ఘన విజయం సాధించారు. ఈ దంపతులిద్దరూ ఒకేసారి ఇచ్చాపురం మున్సిపల్ కౌన్సిల్‌లో అడుగుపెడుతుండటంతో వీరి గెలుపు స్థానికంగా ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్

✕
✕