AP: అహోబిలంలో వైసీపీ నేతలు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, దానిని అడ్డుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వాహనంపై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇది తనను హత్య చేసేందుకు జరిగిన ప్రయత్నమని ఆమె ఆరోపించారు. వారం రోజులుగా హెచ్చరిస్తున్నా పోలీసులు స్పందించలేదని, వారి సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయని అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు పోలీసులే బాధ్యత వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ దాడిని టీడీపీ తీవ్రంగా ఖండించింది.