AP: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇంటర్ విద్యార్థిని స్పందన మృతి చెందింది. తనపై వంశీకృష్ణ అనే యువకుడు అసభ్యంగా ప్రవర్తించాడని, దాడి చేశాడని పోలీసుల ఫిర్యాదు చేసిందని స్పందన తండ్రి వెల్లడించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, మనస్తాపంతో వారం రోజుల క్రితం ఉరేసుకుందన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచిందని, తన కూతురు మృతికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని స్పందన తండ్రి ఆరోపించారు.