AP: ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీలు, పట్టణాలు, నగరాల్లోని వార్డు సచివాలయాలను స్వర్ణ వార్డు సచివాలయాలుగా, గ్రామీణ ప్రాంతాల్లోని సచివాలయాలను స్వర్ణ గ్రామ సచివాలయాలుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, ముద్రలను కూడా మార్చాలని ఆదేశించింది. ఈ మార్పు ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన, మెరుగైన సేవలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.