AP: హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హిందూపురం ప్రజలకు నందమూరి కుటుంబం రుణపడి ఉంటుందని, చరిత్ర సృష్టించాలన్నా, తిరగరాయాలన్నా తమ కుటుంబానికే సాధ్యమని తెలిపారు. హిందూపురం అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని, కొత్త కంపెనీలను తీసుకువచ్చి నిరుద్యోగులకు అండగా ఉంటానని బాలకృష్ణ హామీ ఇచ్చారు.