ఆదోని: బీజేపీలో చేరిన 30 కుటుంబాలు

ఆదివారం ఆదోని పట్టణం టిట్కో కాలనీలోని 30 కుటుంబాలు, యువ నాయకుడు హాజర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలో బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ కో-కన్వీనర్ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ, టిట్కో కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వంలో అసంపూర్తిగా మిగిలిన అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రభుత్వం పూర్తి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్