ఆదోని మండలంలోని విరుపాపురంకు చెందిన వృద్ధురాలు బోయ లక్ష్మమ్మ శుక్రవారం నుంచి కనిపించడంలేదని శనివారం కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం కడుపు నొప్పి భరించలేక వీరపాపురం గ్రామం నుండి ఆదోనికి ఆటోలో ఆసుపత్రికి చికిత్సకు వెళ్లిన ఆమె మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆదోని పట్టణంలో అదృశ్యమైందన్నారు. ఆచూకీ తెలిసినవారు 9963839413, 9391775043 ఫోన్ నెంబర్లకు తెలియజేయాలన్నారు.