ఆదోని పట్టణంలోని పలు హోటళ్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ శాఖసంయుక్తంగా దాడులు నిర్వహించారు. మంగళవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజ్ గోపాల్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సందీప్ ఆధ్వర్యంలో సిబ్బంది వివిధ హోటళ్లను తనిఖీ చేసి, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన హోటళ్ల యజమానులకు జరిమానాలు విధించారు.