ఆదోనీలో 16ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి శనివారం వచ్చింది. పత్తికొండ గురుకులంలో ఇంటర్ చదువుతున్న బాలిక శుక్రవారం వైద్యం కోసం తల్లితో ఎమ్మిగనూరుకు రావాల్సి ఉండగా పొరపాటుగా ఆదోనీ బస్సు ఎక్కింది. తిరిగి ఆదోని బస్టాండ్‌లో ఎదురు చూస్తుండగా ఆటో డ్రైవర్ రమేష్ మాయ మాటలతో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారం చేసి హాస్టల్ వద్ద వదిలేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి రమేష్‌ను అరెస్ట్ చేశారు. కాగా నిందితుడు బాలికపై పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా సమాచారం.