ఆదోని: వైసీపీ నుంచి టీడీపీలోకి చేరికలు

ఎన్నికల హామీలను నెరవేరుస్తూ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా మన్ననలు పొందుతున్నారని ఆదోని టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు తెలిపారు. మంగళవారం ఆదోని మండలం బైచిగేరిలో వైసీపీ నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఉమాపతి నాయుడు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో బోయ రాముడు, తిమ్మన్న, వెంకటేశ్, లక్ష్మన్న, పౌలు, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్