ఆదోని మున్సిపల్ కౌన్సిలర్ల పై ఎమ్మెల్యే పార్థసారథి వాల్మీకి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆదోనిలో మున్సిపల్ అంశాలపై ఆయన మాట్లాడారు. కౌన్సిల్ సమావేశానికి కౌన్సిలర్లు డుమ్మాకొట్టి, కోరం లేదంటారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రతిపాదనలు ఇస్తే వైసీపీ కౌన్సిలర్లు ఆమోదించడంలేదన్నారు. ఎలాంటి అవినీతి లేకుండా ఉన్న మున్సిపల్ చైర్మన్ ను మార్చాలంటూ వైసిపి కౌన్సిలర్లు చేస్తున్న తీరును ఆయన తప్పు పట్టారు.