ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తన భాషా మార్చుకోవాలని కౌన్సిలర్ సందీప్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆయన ఆదోనిలో ఛైర్ పర్సన్ బోయ శాంతపై అవిశ్వాస తీర్మానం అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కౌన్సిలర్లను డబ్బు ఆశ, వ్యాపారం, ఉద్యోగంలో బెదిరింపులకు పాల్పడిన చివరకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి సైన్యం, మాజీ ఎమ్మెల్యే గట్టిగా బుద్ధి చెప్పామన్నారు. విద్యావంతుడైన ఎమ్మెల్యే కౌన్సిలర్లపై మాట్లాడే తీరును తప్పు పట్టారు.