ఆదోని పట్టణంలో బీజేపీకి షాక్ ఇస్తూ మంగళవారం ఒక కౌన్సిలర్ వైసీపీలో చేరారు. వైసీపీ కార్యాలయంలో 12వ వార్డు కౌన్సిలర్ ప్రత్యక్షమయ్యాడు. స్థానిక రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో బీజేపీలో చేరిన ఆదోని పట్టణంలోని 12వ వార్డు కౌన్సిలర్ మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సమక్షంలో తిరిగి వైసీపీ పార్టీలో చేరారు. సొంతగూటికి చేరిన ఆదోని వైఎస్ఆర్సీపీ 12 వార్డు హావణపేట కౌన్సిలర్ వసీంను సాదరంగా ఆహ్వానించారు.