ఆదోని: రైల్వే ట్రాక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

ఆదోని మండలంలోని కుప్పగల్లు–ఇస్వీ రైల్వే స్టేషన్ల మధ్య అప్‌లైన్ ట్రాక్ వద్ద సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో రైల్వే హెడ్ కానిస్టేబుల్ సి. శివరామయ్య ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదవశాత్తు రైలు నుంచి కిందపడడంతో మృతి చెందినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు నీలం రంగు టీ-షర్ట్, సిమెంట్ రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్