ఆదోని పట్టణంలోని ఏరుకుల కాలనీలో నెలకొన్న సమస్యలు త్వరలో పరిష్కరిస్తానని ఎమ్మెల్యే డాక్టర్ సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మహిళలు ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. తమ కాలనీలో డ్రైనేజీ కాలువలు, ఇరుకుగా రోడ్లు, కరెంట్ పోల్స్, త్రాగునీటి తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.