కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో సుమారు రూ.33 లక్షల విలువైన 13.5 కిలోల వెండి బిస్కెట్లను ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మిగనూరుకు చెందిన ఇద్దరు వెండి వ్యాపారులు షేక్ షాకీర్, అక్షయ్ జాదవ్ స్కూటీపై వెళ్తుండగా అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని ఆపి తనిఖీ చేశారు. వెండికి సంబంధించిన సరైన పత్రాలు చూపించలేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వెండి తరలింపు వెనుక అక్రమ వ్యాపారం లేదా మాఫియా ప్రమేయం ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.