ఆదోనిలో ఈ నెల 29న జాబ్ మేళా

ఈ నెల 29న ఆదోని సాయి డిగ్రీ కాలేజీలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ నర్సప్ప, కాలేజీ ప్రిన్సిపల్ వీవీ జనార్దన్ రెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ జాబ్ మేళాకు టెన్త్, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమా, ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని తెలిపారు. నిరుద్యోగులు ఉదయం 10 గంటలకు ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్