ఆదోని మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన మెడికల్ క్యాంపులో పారిశుధ్య సిబ్బందికి బుధవారం వైద్య పరీక్షలు నిర్వహించి, కిట్లను అందజేశారు. డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంక్ విభాగాల్లో పనిచేసే సిబ్బందికి పూర్తి శరీర వైద్య పరీక్షలు నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ క్యాంపును ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.