ఆదోనిలో యువకుడి హత్య

కర్నూలు జిల్లా ఆదోనిలో మద్యం మత్తులో చోటుచేసుకున్న ఘర్షణ ఒకరి ప్రాణాలను బలిగొంది. ఆటో డ్రైవర్ రంజన్, ఖాదర్ బాషా (26)ను మాట్లాడాలని పిలిచి దాడి చేయడంతో అతను మృతి చెందాడు. తనపై ఉన్న దొంగతనం కేసు గురించి బయటపెట్టాడనే కక్షతోనే ఈ హత్య చేశాడని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై గతంలోనే దొంగతనం కేసులు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్

✕
✕