నాగనాథనహళ్లి: పేకాటరాయుళ్ల అరెస్ట్

ఆదోని మండలంలోని నాగనాథనహళ్లి గ్రామంలో హెబ్బటం రోడ్డులో ఆదివారం పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఇస్వీ ఎస్సై డాక్టర్ నాయక్ తెలిపారు. ఎస్సై నాయక్ తెలిపిన వివరాల ప్రకారం నిందితుల నుంచి రూ. 16, 100 నగదు స్వాధీనం చేసుకున్నారు. నాగరాజు, హనీష్, ఆనంద్, యల్లప్ప, విష్ణుచరణ్, సలీమ్బాషా, మహబూబ్ బాషా, అహ్మద్ లను అరెస్టు చేసి, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్