ఆదోనిలో కల్వర్టు వద్ద ఇరుక్కున్న బియ్యం లారీ

ఆదోనిలో మంగళవారం టీజీఎల్ కాలనీ నుంచి నిజాముద్దీన్ కాలనీకి వెళ్లే మార్గంలో బియ్యం తరలిస్తున్న Ap 21 V 5839 నంబర్ లారీ కల్వర్టు వద్ద ఇరుక్కుపోయింది. రోడ్డు మలుపు వద్ద కల్వర్టు కొంగిపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. రోడ్డు నాణ్యత సరిగా లేకపోవడమే ఘటనకు కారణమని కొందరు స్థానికులు ఆరోపిస్తుండగా, మరికొందరు లారీలో అధిక లోడ్ ఉండటమే కారణమని అభిప్రాయపడుతున్నారు. అసలు కారణాలపై అధికారులు పరిశీలించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕