ఆదోని వ్యవసాయ మార్కెట్‌లో గురువారం వేరుశనగ క్వింటా గరిష్ట ధర రూ. 6, 929 పలికింది. బుధవారంతో పోలిస్తే రూ. 10 పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా వేరుశనగ కనిష్ట ధర రూ. 3, 900, పత్తి గరిష్ట ధర రూ. 7, 666, కనిష్ట ధర రూ. 4, 000 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. సరుకులను మార్కెట్‌కు సరైన సమయంలో తీసుకొచ్చి అధికారులకు సహకరించాలని కోరారు.