ఆదోనిలో తొలిసారిగా 41వ ఏపీ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ ప్రారంభం

ఆదోనిలో తొలిసారిగా 41వ ఏపీ స్టేట్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026 శుక్రవారం ప్రారంభమైంది. అక్టోబర్ 2 నుండి 4 వరకు మూడు రోజుల పాటు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో జిల్లా అథ్లెటిక్స్ ఛైర్మన్ మారుతి నాయుడు ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించనున్నారు. డీఎస్పీ వెంకటరమణ, ఆర్డీవో అరుణా దేవి ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ జెండాకు వందనం చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్‌ఫాస్ట్‌లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕