ఆదోని టిడ్కో అపార్ట్‌మెంట్లలో నీటి లీకేజీలు

ఆదోనిలోని TIDCO అపార్ట్‌మెంట్లలో వర్షం కురిసినప్పుడు ఫ్లోర్ నుండి ఫ్లోర్‌కు నీటి లీకేజీలు వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. భవనాల్లో చీలికలు కనిపిస్తున్నాయని, నిర్మాణ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అపార్ట్‌మెంట్లను లబ్ధిదారులకు అప్పగిస్తే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕