ఆళ్లగడ్డ: మంటల్లో కాలిపోయిన కారు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్ద చింతకుంట్ల వద్ద గుర్తుతెలియ వ్యక్తులు కారుకు నిప్పటించడంతో మంటలు చెలరేగి శనివారం కారు అంటుకుంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. పెట్రోల్ బంక్ సమీపంలో ఈ ప్రమాదం సంభవించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్