పేద కుటుంబంలో పుట్టి, పగటిపూట కూలీ పనులు చేస్తూ, రాత్రిపూట చదువుకుని గ్రూప్-2లో ASOగా ఎంపికైన రుద్రవరం మండలం యల్లావత్తుల గ్రామానికి చెందిన విజయలక్ష్మి అందరికీ ఆదర్శంగా నిలిచారు. ట్రాక్టర్ నడుపుతూ కుటుంబాన్ని పోషించే భర్త ప్రమాదానికి గురై ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, ఆమె పట్టుదల వదలకుండా స్వయంకృషితో ఉద్యోగం సాధించారు.