ఆళ్లగడ్డ వద్ద ప్రమాదం.. ఒకరి మృతి

ఆళ్లగడ్డ మండలం బత్తలూరు వద్ద మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లింగ మోహన్ అనే యువకుడు మృతి చెందాడు. సిరివెళ్లకు చెందిన లింగ మోహన్, శ్రీనివాసులు బైక్‌పై వెళ్తుండగా అకస్మాత్తుగా బర్రె అడ్డురావడంతో వాహనం అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లింగ మోహన్‌ను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్