ఆళ్లగడ్డ: పంట పొలాల్లో అగ్నికీలలు

ఆళ్లగడ్డ మండలం చిన్నకందుకూరులో షార్ట్ సర్క్యూట్ కారణంగా 20 ఎకరాలకు పైగా మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి అయ్యింది. పంట కోత మిషన్ మొక్కజొన్నను కోస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీనివల్ల పంటపై నిప్పురవ్వలు పడి మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది.

సంబంధిత పోస్ట్