కాలువలో పసికందు మృతదేహం లభ్యం

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కాసింతల బ్రిడ్జి వద్ద కాలువలో అప్పుడే పుట్టిన పసికందు మృతదేహం నీటిలో లభ్యమైంది. గుర్తుతెలియని వ్యక్తులు శిశువును నీటిలో పడేసి వెళ్లినట్లు గుర్తించారు. మృతదేహం చుట్టూ కుక్కలు ఉండటాన్ని చూసి స్థానికులు దిగ్భ్రాంతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. అనాథాశ్రమానికి అప్పగించి ఉంటే చిన్నారి బతికేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్

✕
✕