ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా ఉండండి..ఎస్పీ

నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరన్ సోమవారం రాత్రి ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, వారి సమస్యలను సమగ్రంగా విచారించి సత్వర న్యాయం అందించాలని సిబ్బందికి సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ డిఎస్పి శ్రీనివాస రావు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕