డోన్: వెండి పట్టీల చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

డోన్ సమీపంలో ప్రయాణిస్తున్న బస్సులో 30 కేజీల వెండి పట్టీలను దొంగిలించిన కేసులో మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 66.62 లక్షల విలువైన 30,200 గ్రాముల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్