నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. బోయిలకుంట్ల సమీపంలో ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ జరిగింది. కీలక నిందితుడిపై గతంలోనే పలు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.