శుక్రవారం ఆళ్లగడ్డ మండలం బత్తులూరు సమీపంలో కడప నుంచి కర్నూలుకు వెళ్తున్న కారు డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో రమణారెడ్డి మృతి చెందగా, వినయ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రూరల్ ఎస్సై వరప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.