చికిత్స పొందుతూ ఒకరు మృతి

ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన జనార్దన్ (37) అప్పుల బాధతో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ ఆదివారం కర్నూలు సర్వజన వైద్యశాలలో మృతి చెందాడు. గత ఏడాది పాణ్యంలో రెస్టారెంట్ నడుపుతూ జీవనం సాగించిన జనార్దన్, అప్పుల పాలవడంతో ఈనెల 15న నంద్యాల శివారులో పురుగు మందు తాగాడు. అతన్ని నంద్యాల, అనంతరం కర్నూలు ఆసుపత్రులకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్