నంద్యాల జిల్లా చాగలమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌పై శుక్రవారం పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ. 50 వేల నగదు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై రాజారెడ్డి హెచ్చరించారు.