ఆళ్లగడ్డలో పోలీసుల హెచ్చరికలు.. జాగ్రత్తలు పాటించాలి

ఆళ్లగడ్డలో వేసవి సెలవుల్లో ప్రజలు విహారయాత్రలకు వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్సై పీరయ్య సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ఆయన కోరారు. నేర నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్