శిరివెళ్ల: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్టు

శిరివెళ్లలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం, షేహిన్షా, పరమేష్ పేరూరు రహదారిలోని మల్లెలమ్మ గుడి వద్ద గంజాయి అమ్ముతుండగా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1, 400 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. బండిఆత్మకూరుకు చెందిన రెడ్డమ్మ వద్ద గంజాయి కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ముగ్గురిపై కేసు నమోదు చేయగా, ఇద్దరిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించారు.

సంబంధిత పోస్ట్