రుద్రవరం మండల ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన యు.వి.వరప్రసాద్‌ను నరసాపురం గ్రామ టిడిపి నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు గుఱ్ఱం పక్కిర శనివారం సన్మానించారు.నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పూలమాలలు,శాలువాలతో మర్యాద పూర్వకంగా సత్కరించారు. గ్రామాలలో శాంతి భద్రతల పరిరక్షణలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని పోలీస్ శాఖకు హామీ ఇచ్చారు.