ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థి సుభాష్ చంద్రబోస్ ఈనెల 10న క్రికెట్ ఆడేందుకు ఇంటి నుండి బయలుదేరి తిరిగి రాలేదు. రెండు రోజులుగా అతడి జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై మహబూబ్ బాషా తెలిపిన ప్రకారం మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఏవైనా సమాచారం ఉంటే 9121101158కి సంప్రదించాలన్నారు.