ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అంగన్‌వాడీ టీచర్ లేపాక్షమ్మను కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు ఆలూరు ప్రభుత్వాసుపత్రిలో మంగళవారం పరామర్శించారు. వీరేష్ అనే వ్యక్తి అసభ్యంగా దూషించి అవమానించడమే ఆత్మహత్యాయత్నానికి కారణమని బాధితురాలు వివరించింది. దీనిపై నిందితుడిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. ఎస్‌ఐ విజయ్‌తో మాట్లాడి కేసు పురోగతిపై ఆరా తీసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాల్లో దాడులు, దౌర్జన్యాలను కూటమి ప్రభుత్వం సహించదని ఎంపీ హెచ్చరించారు.