ఆలూరు: భర్త వేధింపులతో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

దేవనకొండ మండలం వెంకటాపురంలో మాదిగ లక్ష్మి(23) శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లి లలిత తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మి కర్నూలుకు చెందిన మనోహర్‌తో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి అబ్బాయి, అమ్మాయి ఉన్నారు. భర్త ప్రతిరోజూ లక్ష్మిని వేధించేవాడని ఈ వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్య చేసుకుందని లలిత ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వంశీనాథ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్