కర్నూలు జిల్లాలోని 17 మండలాల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. హొళగుందలో 38. 2, క్రిష్ణగిరిలో 27. 6, వెల్దుర్తిలో 18. 6 మిమీ వర్షపాతం నమోదైంది. ఖరీఫ్ సీజన్‌కు భూములు సిద్ధం చేసుకునే పనిలో రైతులు దృష్టి సారించారు. రానున్న రెండు, మూడు రోజుల్లో మరింత వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ఏడాది వేసవిలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి.